ప్రజల్లో బాలకృష్ణ పలుచన

ప్రజల్లో బాలకృష్ణ పలుచన

సినిమా జీవితానికి,వాస్తవ జీవితానికి వ్యత్యాసం తెలీకుండా ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క బాలకృష్ణ అనే చెప్పాలేమో…అభిమానులపై చేయిచేసుకోవడం,కోపాన్ని అణుచుకోకుండా బూతులు అందుకోవడం బాలకృష్ణకు అలవాటుగా మారింది.కొద్ది రోజుల క్రితం హిందూపురం సమీపంలోని సిరివరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతుండగా..టీడీపీ కార్యకర్త రవికుమార్ సిరివరం చెరువుకు నీరు విడుదల చేయాలని కోరాడు.దీంతో బాలయ్య ఆగ్రహంతో ఊగిపోయారు.అంతటితో ఆగకుండా కార్యకర్త రవికుమార్ ను తోసేశారు.ఇక కార్యకర్త రవికుమార్ ను కొట్టినంత పనిచేసిన బాలయ్య బాబు..అతణ్ని బయటకు పంపాలని పోలీసులను ఆదేశించారు.ఇంకేముంది అధికారంలో ఉన్న ప్రభుత్వానికి చెందిన నాయకుడు కాబట్టి బాలకృష్ణ మాటలు విన్న పోలీసులు రవికుమార్ ను బయటకు పంపించారు.

సంయమనం కోల్పోయి…
ఆ తర్వాత బాలకృష్ణ ఓ వీడియో జర్నలిస్టుపై వీరంగం చేసిన ఘటన కూడా పెద్ద దుమారం లేపింది. జర్నలిస్టుని ప్రాణాలు తీస్తా అంటూ బెదిరించి అందరి ముందే దుర్భాషలాడారు.దీంతో మీడియా సంఘాలుసంయమనం కోల్పోయి… బాలకృష్ణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.మీడియాకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశాయి.దీంతో తనతప్పు తెలుసుకున్న బాలకృష్ణ..తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మీడియాకు క్షమాపణలు తెలియజేశారు.వరుసగా ఇలా అభాసుపాలవుతున్న బాలకృష్ణ ఎన్నికల వేళ సంయమనం కోల్పోయి మళ్లీ మళ్లీ అవే తప్పుల్ని కొనసాగిస్తున్నారు.తాజాగా,హిందూపురంలో భార్య వసుంధరతో కలిసి రాత్రి రోడ్ షోలో బాలయ్యకు 50,60వేల మెజార్టీ వస్తుందంటూ అభిమానులు కేకలు వేస్తుంటే..బాలయ్య మాత్రం అంత మెజార్టీ వస్తుందారా అంటూ చురాకుపడ్డారు.’నా కొడుకా అంత మెజార్టీ రాకపోతే ఏసిపాడదొబ్బుతా’అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.

తీవ్ర వ్యతిరేకత!
ఇలా వేలల్లో,లక్షల్లో మెజార్టీ వస్తుందంటూ తనను తప్పుదోవ పట్టిస్తున్నారని..ఇలాంటి వారి కంఠం కోయాలంటూ సైగలు చేస్తూ భార్య వసుంధరతో బాలయ్య చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా ట్రెండ్ అవుతోంది.నాకు కనుక అంత మెజార్టీ రాలేదనుకో..నీ పేరు,అడ్రస్ చెప్పరా.గెలవకపోతే పీక కోస్తా..ఏసీ పాడదొబ్బుతా అంటూ టీడీపీ కార్యకర్తకు బాలయ్య వార్నింగ్ ఇస్తున్నట్టు వీడియోలో కనిపించింది.ఈరకంగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలోనే…బాలయ్యకు అంత మెజార్టీ వస్తుందనే ఆశలు లేనట్టు వీడియో ద్వారా తెలిసిపోతోంది.గెలుస్తాం కానీ అంత మెజార్టీ వచ్చేలా లేదంటూ బాలయ్య పేర్కొనడం హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది.బాలకృష్ణ ఇలా పదే పదే సహనాన్ని కోల్పోతు తన సొంత నియోజకవర్గంలోనే అభాసుపాలవుతున్నారు.అధికారంలో ఉన్నాం కదా అని ప్రజలను ఏమన్నా చెల్లుతుందనే అహంకారం వల్ల నష్టమే కానీ ఒరిగేదేమీ ఉండదని విశ్లేషకుల అభిప్రాయం.ఇలాంటి విషయాలపై ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. తండ్రి నుంచి,తన నటన నుంచి సంపాదించుకున్న బాలకృష్ణ ప్రజల్లో,ప్రజలతో ఉన్నపుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోలేకపోవడం బాధాకరం అని స్థానికులు చెబుతున్న మాట.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *