మరోసారి నోరుజారిన బాలయ్య

మరోసారి నోరుజారిన బాలయ్య

బాక్సాఫీస్ బాలయ్య మరోసారి రెచ్చిపోయారు.పదే పదే తన నోటికి పని చెప్తూ వస్తున్నారు.అంతేకాదు..ఈసారి తన విశ్వరూపం ప్రదర్శించారు.సొంత కార్యకర్తలపై ఆగ్రహంతో ఊగిపోయారు.ఈసారి జరిగే ఎన్నికల్లో తనకు వచ్చే మెజారిటీపై అభిమానులు చేసిన వ్యాఖ్యలతో బాలయ్య హద్దు దాటి మాట్లాడారు.సినిమాల్లో మాదిరి పంచ్ డైలాగులు చెప్తూ అందరిని విస్మయానికి గురి చేస్తున్నారు.

భార్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాలయ్య.దీంతో అభిమాన నాయకుడు కనిపించాడనే కార్యకర్తలందరూ ఆనందంగా పండగ చేసుకున్నారు.ఈసారి 50వేల మెజారిటీ ఖాయం అని ఒకరంటే,లక్ష మెజారిటీ గ్యారెంటీ అంటూ మరొకరు అందుకున్నారు.నిజానికి ఇందులో కోపగించుకోవడానికేం లేదు…అది అభిమానుల ఆనందం.కానీ బాలయ్యకు ఎందుకు కోపమొస్తుందో ఎవరికీ తెలియదు కదా…ఈసారి కూడా అలానే కోపమొచ్చింది.

చూశారుగా బాలయ్య ఫ్రస్ట్రేషన్ ఏరేంజ్‌లో ఉందో.గెలవడానికే కష్టం అనుకుంటే వేలల్లో మెజారిటీ ఏంటీ అంటూ విరుచుకుపడ్డారు.అంతలోనే మరో టీడీపీ అభిమాని లక్ష మెజారిటీ అంటూ అరిచాడు. దీంతో ఈసారి బాలయ్యకు మరింత కోపం వచ్చేసింది.

ఇలా సాగింది బాలయ్య బూతుపురాణం.ఇక అక్కడితో కూడా ఆగలేదు బాలయ్య.అభిమాని వైపు కోపంగా చూస్తూ పీక కోసేస్తా అనే అర్థం వచ్చేలా సైగ చేశారు.నిజంచెప్పాలంటే ఓవైపు జనాల్లేకపోయినా ప్రచారం చేస్తూ కొందరు నేతలు ముందుకు సాగిపోతుంటే..మరోవైపు వస్తున్న జనాల్ని బాలయ్య ఇలా బూతులు తిట్టి పంపిస్తున్నారు.అయితే అభిమానులపై చేయి చేసుకోవడం,నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం బాలయ్యకు కొత్తేంకాదు.కానీ..ఈ ఎన్నికల వేళ బాలయ్య మరింత సహనం కోల్పోయి ఎందుకు మాట్లాడుతున్నారో మరీ ఆయనకే తెలియాలి..?

కొన్నిరోజుల క్రిందట సిరివరం గ్రామంలో ప్రచారానికి వెళ్లిన బాలయ్య బాబు..సొంతపార్టీ కార్యకర్తను కొట్టినంత పనిచేశారు.దీంతో మనస్తాపానికి గురైన ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు.ఇక అంతకుముందు ఓ వీడియో జర్నలిస్టుపై వీరంగం చేశారు బాలయ్య బాబు.దీంతో మీడియా సంఘాలు బాలకృష్ణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.మీడియాకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశాయి.దీంతో తనతప్పు తెలుసుకున్న బాలకృష్ణ..తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మీడియాకు క్షమాపణలు తెలియజేశారు.

మొత్తానికి బాలకృష్ణ వింత వైఖరిపై టీడీపీ నేతలే మండిపడుతున్నారు.బాలయ్య వైఖరితో టీడీపీకి నష్టమే తప్ప లాభమేమీ ఉండదని వాపోతున్నారు.ఇక ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదని హైకమాండ్ ముందు తమగోడును వెల్లబోసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *