ABCD ట్రైల‌ర్ రిలీజ్

ABCD ట్రైల‌ర్ రిలీజ్

మెగా హీరోల్లో ప్రస్తుతం హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో అల్లు శిరీష్… ఒక్క క్షణం సినిమా తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న శిరీష్ చేస్తున్న లేటెస్ట్ మూవీ… ఏబీసీడీ. మలయాళ హిట్ సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ మూవీ ఇప్పటి వరకూ పాజిటివ్ వైబ్ నే క్రియేట్ చేసింది కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఏబీసీడీ ట్రైలర్ మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. దానికి కథలో బలం లేకపోవడమే.. తండ్రి సంపాదనతో గాలికి తిరిగే కొడుకు, అతన్ని దారిలో పెట్టడానికి పరీక్ష పెట్టె తండ్రి… సింపుల్ గా చెప్పాలంటే ఇదే ఏబీసీడీ కథ. ఇదే పాయింట్ పై తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.

ఏబీసీడీ ట్రైలర్ చూస్తే నాని నటించిన పిల్ల జమిందార్, ఆది సాయి కుమార్ నటించిన సుకుమారుడు సినిమాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన నాని కూడా పిల్ల జమిందార్ గుర్తొస్తుంది అన్నాడు అంటే ఏబీసీడీ కథలో ఎంత కొత్తదనం ఉందొ అర్ధం చేసుకోవచ్చు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న అల్లు శిరీష్ 16 నెలల ఎదురు చూసి, ఇలాంటి రెగ్యులర్ కథతో ఎందుకు సినిమా చేశాడో, పైగా స్ట్రెయిట్ మూవీ కాకుండా రీమేక్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయనకే తెలియాలి కానీ కెరీర్ ఒడిదుడుకుల్లో ఉన్న టైములో ఇలాంటి కథతో ప్రేక్షకుల ముందుకి వస్తే మాత్రం మరోసారి కష్టాలు తప్పవనే విషయం శిరీష్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *