మే 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఏబీసీడీ

మే 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఏబీసీడీ

అవెంజర్స్ కి, మహర్షి సినిమాకి భయపడి మీడియం రేంజ్ సినిమా నిర్మాతలంతా తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసేసుకున్నారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రతాపం ఒక వారానికే చల్లబడిపోయింది. ఇక తాజాగా మహర్షి సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ ని పూర్తి చేసుకుంది. అయితే చాలామంది భయపడినట్లుగా మహర్షి సినిమా భారీ సక్సెస్ అయితే కాలేదు. మహర్షి సినిమా మీద ఉన్నంత ఎక్స్ పెక్టేషన్స్ సినిమా విడుదలయ్యాక లేవు. మహేష్ బాబు 25వ సినిమాగా భారీ అంచనాలతో విడుదలైన మహర్షి సినిమా ఆ అంచనాలు అందుకోలేకపోయింది. కానీ మహర్షి నిర్మాతలు మాత్రం రోజుకో సక్సెస్ మీట్ పెడుతూ సినిమాని భారీగా ప్రమోట్ చేస్తున్నారు. మహేష్ ఎప్పుడు తన సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనడు. కానీ మహర్షి విషయంలో మాత్రం సక్సెస్ మీట్ కి కూడా హాజరవడం, సినిమా భారీ సక్సెస్ అయినందుకు కాలర్ కూడా ఎగరేస్తున్నాడు.

అల్లు శిరీష్ నటించిన ఎబిసిడిని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయినా చాలాస్లార్లు రిలీజ్ డేట్ మార్చుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు మహర్షి టాక్ చూసి ఎలాంటి బెదురూ లేకుండా మే 17న రిలీజ్ చేయబోతున్నారు.. మంచి ప్రమోషన్స్ తో ఏబీసీడీ ని బాక్సాఫీసు వద్దకు దింపుతున్నాడు. మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ అయితే మామూలుగానే తన సినిమా పోస్ట్ పోన్ చేసుకునేవాడే. కానీ ఇప్పుడు మాత్రం అల్లు శిరీష్ ఎంతో కాన్ఫిడెంట్ గా రంగంలోకి దిగుతున్నాడు. అయితే ఈ సినిమాకు పోటిగా నిఖిల్ నటించిన అర్జున్ సురవరం కూడా ఈ నెల 17 రిలీజ్ కాబోతుంది. మరి ఈ బాక్సాఫీస్ పోరులో ఎవరు విన్నర్‌గా నిలుస్తారో చూడాలి..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *