సాలీడ్ హిట్ కోసం ట్రై చేస్తున్న అల్లు శిరీష్

సాలీడ్ హిట్ కోసం ట్రై చేస్తున్న అల్లు శిరీష్

మెగా హీరోలు మంచి హిట్స్ తో దూసుకుపోతుంటే, అల్లు శిరీష్ మాత్రం సాలీడ్ హిట్ కోసం చాలా రోజు నుంచి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ABCD సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో హిట్ అందుకొవాలని చూస్తున్నాడు ఈ అల్లు హీరో. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రటీమ్. ఆ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కెయండి.

అల్లు వారి చిన్నబాయి అల్లు శిరీష్ హీరోగా మొదలు పెట్టినప్పటి నుంచి సాలిడ్ సక్సెస్ కోసం గట్టిగనే ప్రయత్నాలు చేస్తున్నాడు.శ్రీరస్తు శుభమస్తు మూవీతో బిలో యావరేజ్ హిట్ అందుకున్నా అల్లు శిరీష్ అ తరువాత సరైన కథలు సెలక్ట్ చేసుకోవడంతో విఫలం అవుతున్నాడు. హోమ్ ప్రోడక్షన్ ఉన్న కథలపై మంచి కమాండ్ ఉన్న అల్లు అరవింద్ బ్యాక్ సపోర్ట్ ఉన్న సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. మెగా కాంపౌండ్ నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన మిగత స్టార్స్ తక్కువ టైంలోనే హీరోగా సక్సెస్ అవుతుంటే అల్లు శిరీష్ మాత్రం హీరోగా నిలతోక్కుకోవడానికే ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాడు. యాక్టింగ్‌లో ఈజ్ ఉన్న హిట్టు కోసం నానా తంటాలు పడుతునే ఉన్నాడు.

ఆ మధ్య వచ్చిన ఒక్కక్షణం సినిమాతో ఎక్స్‌ఫర్ మెంట్ చేసిన ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్‌లో హిట్ అందుకోలేకపోయాడు. ప్రయోగం కూడా వికటిచడంతో కాస్త గ్యాప్ తీసుకున్న అల్లు శిరీష్ ప్రస్తుతం సంజీవ్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో ఏబీసీడీ సినిమా చేస్తున్నాడు. అమెరిక్ బోర్న్ క‌న్‌ఫ్యూజ్డ్ దేశి అనేది ట్యాగ్ లైన్‌ వస్తున్న ఈ చిత్రం మే 17న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే అల్లు శిరీష్‌లో చాలా మార్పు కనిపిస్తుంది. హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ గ్లామర్ ఈ సినిమాకు మరో హైలైట్. అల్లు శిరీష్ పక్కన భరత్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సింపుల్‌గా నడిచే కథను చివరకు రాజకీయాలకు లింక్ చేస్తూ.. కన్ఫ్యూజ్ చేసిన ఏబీసీడీ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా అయితే ఉంది.హిట్ కోసం ఆరాటపడుతున్న అల్లు శిరీష్‌కు ఈ సినిమా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *