బీరు కోసం భర్తకు విడాకులిస్తానంటున్న యువతి!

బీరు కోసం భర్తకు విడాకులిస్తానంటున్న యువతి!

దంపతుల మధ్య ఎప్పుడు ఎలాంటి కొట్లాట ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో ఎవరికీ తెలీదు. అయితే…ఎలాంటి సమస్య వచ్చినా వారిద్దరు సర్దుకుని కాపురం చేసుకోవడంలోనే జీవితం సంతోషంగా గడిచిపోతుంది. ఇక కొత్తగా పెళ్లైన వారికైతే తమ భాగస్వామి గురించిన విషయాలు అన్నీ కొత్తగానే అనిపిస్తాయి. వాటిని అంగీకరించి సర్దుకోవడంలోనే బంధం బలపడుతుంది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ యువజంట విషయంలో ఇలాంటి చిన్న సమస్యే వారిని విడదీసేదాకా వెళ్లింది. నిర్ణయ్‌నగర్‌కు చెందిన యువకుడికి మధాపూర్‌కు చెందిన అమ్మాయితో వివాహమైంది. పెళ్లి జరిగిన తర్వాత ఇద్దరూ ఎంజాయ్ చేయడానికి ఇండోనేషియాలోని బాలీకి ట్రిప్ వెళ్లారు. సంతోషంగా ఉన్న సమయంలో అమ్మాయి తన భర్తతో బీరు తాగుదామని అడిగింది. భార్య కోరిక విని షాక్ అయిన ఆ యువకుడు…తాగొద్దని భార్యకు చెప్పాడు. దీనికి బాధపడిన అమ్మాయి…ఎలాగైనా సరే బీరు తాగాలని గొడవ చేసింది. భర్త నచ్చజెప్పడానికి ఎంత ప్రయత్నం చేసినా వినలేదు.

రూ. 20 లక్షలు ఇస్తే సరే…

బీరు తాగనివ్వట్లేదని భర్తపై కోపంతో హోటల్‌లో నానా రచ్చ చేసింది. హోటల్‌లో ఉన్న రూమ్ తలుపుని బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేసింది. చుట్టు పక్కన రూమ్‌లో ఉండేవారిని పిలిచి బీరు తాగనివ్వడంలేదని చెప్పింది. ఆమెకు ఎలాగోలా సర్దిచెప్పి తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు అతను. ఇంటికి వచ్చాక భార్య తన సామాను మొత్త సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త నుంచి తనకు విడాకులు కావాలంటూ బెదిరించింది. భరణం కింద ఆమెకు రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అత్తింటిపై తప్పుడు కేసులు పెడతానని బెదిరించింది. చాలా రోజులు పరువు, గౌరవం అని మౌనంగా ఉన్న ఆ యువకుడు..తన బంధువులు, స్నేహుతులకు చెప్పుకుని బాధపడుతున్నాడు. ఇక భరించే ఓపిక లేక పోలీసులను ఆశ్రయించడానికి రెడీ అయ్యాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *