హిల్టన్ హోటల్‌పై...700 కోట్లు దావా వేసిన యువతి

హిల్టన్ హోటల్‌పై...700 కోట్లు దావా వేసిన యువతి

ప్రపంచవ్యాప్తంగా ఆడవారిపై జరుగుతున్న దారుణాల గురించి చాలా పెద్ద చర్చ జరుగుతోంది. Metoo ఉద్యమం మొదలయ్యాక చిన్న చిన్న ఘటనలకే పెద్ద దుమారం రేగుతోంది. సమాజంలో పరువు పోతుందనే భయంతో మగవాళ్లు కూడా ఆడవారి జోలికి పోవాలంటే వెనకడుగు వేస్తున్నారు. ఆడవాళ్లు ఒంటరిగా ఉన్న ప్రదేశాల్లో రహస్య కెమెరాల ద్వారా వారిని రహస్యంగా చిత్రీకరించి పోర్న్ సైట్‌లలో ఉంచి ఆడవారి పరువుతీస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో జరిగింది.

hilten hotel case updates

700 కోట్లు ఇవ్వాల్సిందే…

ప్రపంచంలోని చాలా సిటీల్లో హోటల్స్‌ని నడుపుతున్న హిల్టన్ వరల్డ్ వైడ్, న్యూయార్క్ హోటల్‌లో స్నానం చేసే గదిలో రహస్య కెమెరాలు అమర్చి, తనను నగ్నంగా వీడియో తీసి పరువు పోగొట్టారంటూ ఒక అమ్మాయి ఆ హోటల్‌పై రూ. 100 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 700 కోట్లు) దావా వేసింది.

ఈ ఘటన గురించి మాట్లాడుతూ…జూలై 2015లో న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అయిన ఆల్బానీలో ఉన్న హిల్టన్ ఇన్ అండ్ సూట్స్ హోటల్లో బస చేశాను. ఆ సమయంలో నేను స్నానం చేస్తున్న పూర్తి నగ్న వీడియో తీశారని 20 పేజీల దావాలో ఆరోపణ చేసింది. లా కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ చేసిన నేను, బార్ పరీక్షలు రాయడానికి వెళ్లి హిల్టన్ హోటల్‌లో బస చేశానని…అపుడు వీడియో తీసి పోర్న్ సైట్‌లో ఉంచారని బాధితురాలు చెప్పింది. అప్పుడు రికార్డు చేసిన వీడియో మూడేళ్ల తర్వాత 2018 సెప్టెంబర్‌లో పోర్న్ సైట్‌లో కనబడ్డాయని ఆమె బాధపడింది. ఈ విషయం తనకు స్నేహితుల ద్వారా తెలిసినట్టు…ఆ వీడియోలో ఉన్నది నువ్వే అని లింక్ పంపడంతో నేను దిగ్భ్రాంతికి గురయ్యానని బాధితురాలు పేర్కొంది. ఈ విషయం గురించి సన్నిహితులు, బంధువులు ప్రశ్నిస్తున్నారని దు:ఖపడింది. దీని గురించి హోటల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

మాకేం దొరకలేదు!

ఈ ఘటన గురించి స్పందించిన హిల్టన్ హోటల్ ప్రతినిధి…ఇది తెలిసి షాక్ అయ్యానని, ఈ మధ్యనే హోటల్ పునరుద్ధరణ జరిగిందని అన్నారు. ఈ క్రమంలో హోటల్‌లో ఎటువంటి పరికరాలు కనబడలేదని…తమ హోటల్‌కు వచ్చే అతిథుల విషయంలో, వారి భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *