నీటిదీపం...అమ్మవారి గుడిలో నీళ్లతో వెలిగే దీపం!

నీటిదీపం...అమ్మవారి గుడిలో నీళ్లతో వెలిగే దీపం!

దీపం వెలిగించాలంటే ఏం చేస్తారు. నూనే లేదంటే నెయ్యి పోసి వెలిగిస్తారు. కానీ మధ్యప్రదేశ్‌లోని కాలిసింద్ నది ఒడ్డున ఉన్న గడియాఘాట్ మాతాజీ మందిరంలో నీటితో వెలిగే దీపాన్ని చూడొచ్చు. ఆశ్చర్యంగా ఉన్నా…ఇది అక్షరాల నిజం. ఈ దీపం గత ఐదేళ్ల నుంచి నూనే, నెయ్యి లేకుండా కేవలం నీటితోనే వెలుగుతోంది.

మధ్యప్రదేశ్‌లోని సాజాపూర్ జిల్లా కాలీసింద్ నది ఒడ్డున ఉండే గడియాఘాట్ మాతాజీ మందిరంలో ఈ అద్భుతాన్ని చూడొచ్చు. ఈ వింత చూసేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఐదేళ్ల నుంచి ఈ దీపం ఆరకుండా వెలుగుతూనే ఉందని, దేశంలో చాలా మందిరాల్లో ఇలా ఆరకుండా వెలిగే జ్యోతులు ఉన్నప్పటికీ.. ఈ దీపం మాత్రం చాలా భిన్నమైనదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రమిదలో నిత్యం నూనెకు బదులుగా నీటిని పోస్తే చాలు..వెలుగుతూనే ఉంటుందంటున్నారు.

ఈ ఆలయంలో పూజారిగా ఉన్న సిందూ సింగ్ మాట్లాడుతూ.. “ఇదివరకు ఈ జ్యోతి నూనెతోనే వెలిగేది. ఓ రోజు అమ్మవారు కలలోకి వచ్చి..దీపాన్ని నీటితో వెలిగించాలని చెప్పారు. ఆమె ఆదేశాలను అనుసరించి నీటితో దీపాన్ని వెలిగించాం. అప్పటి నుంచి ఈ దీపం నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది” అని చెప్పారు. అయితే, అది కలా, నిజమా తెలీక ఆశ్చర్యపోయానని, సుమారు రెండు నెలలపాటు ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదన్నారు. ఈ ఆలయం నది ఒడ్డున ఉండటం వల్ల వర్షాకాలంలో పూర్తిగా మునిగిపోతుంది. దీంతో వర్షాకాలంలో ఆలయం మూసేసి ఉంటుంది. మళ్లీ నవరాత్రులకే ఈ ఆలయాన్ని తెరవడం జరుగుతుంది. వచ్చే వర్షాకాలం వరకు దీపం వెలుగుతూనే ఉంటుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *