రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సర్పంచ్‌ భిక్షాటన

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సర్పంచ్‌ భిక్షాటన

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సర్పంచ్‌ భిక్షాటనకు దిగిన సంఘటన కలకలం రేపుతోంది. జిల్లాలోని గంభీరావుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పారిశుద్ధ్య కార్మికుల జీతాల కోసం గ్రామ పరిధిలో భిక్షాటన నిర్వాహించారు. జీతాల కోసం కావలసిన మొత్తాన్ని గ్రామస్థుల నుండి భిక్షాటన ద్వారా సేకరించే ప్రయత్నం చేశారు. సర్పంచ్‌గా గెలిచి నాలుగు మాసాలు గడుస్తున్నా ప్రభుత్వం చెక్ పవర్ ఇవ్వకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సర్పంచు లను ఉత్సవ విగ్రహాలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు తమ పరిధిలో లేదని చెబుతున్నారని శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించి చెక్ పవర్ ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *