వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌ జరుగుతుండగా...ట్రైన్ లో రవిశాస్త్రి

వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌ జరుగుతుండగా...ట్రైన్ లో రవిశాస్త్రి

సెలబ్రెటీలను ఎంతలా ఇష్టపడతామో… అంతేలా ట్రోల్‌ చేస్తాం. మనకి ఆకాశానికి ఎత్తేయడమూ తెలుసు. పగలబడి నవ్వుకునేలా చేయడమూ తెలుసు. ఈ రెండిటిలో ఏ అవకాశాన్నీ వదులుకోకుండా, మన పైత్యాన్ని ప్రదర్శించేస్తాం. ఎంత పెద్ద సెలబ్రెటీ మీదైనా, చిత్రవిచిత్ర ట్రోల్స్‌ చేసి పడేస్తాం. అలా… ఈ సారికి రవిశాస్త్రి బుక్కయ్యాడు. ఒకప్పుడు స్డేడియంలో ఒకాట ఆడిన అతడిని, నెటిజన్లంతా తెగ ఆడేసుకుంటున్నారు. అసలు ఈ కథేంటో, రవిశాస్త్రి ఏం చేసాడో… చూద్దాం పదండి.

తొలుత షాక్‌ అయ్యారు…

టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఫోటో ఒకటి దర్శనమిచ్చింది. ఒకవైపు వెస్టిండీస్‌తో ఈ రోజు టీ20 మ్యాచ్‌ జరుగుతుండగా, అతడు అక్కడుంటమేంటీ… అని అందరూ షాక్‌కు గురయ్యారు. అందులోనూ జనరల్‌ భోగీలో ప్రయాణిస్తుండటం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే… ఆ ఫోటోను చూసిన కాసేపటికే, అసలు విషయాన్ని అర్ధం చేసుకున్న నెటిజన్లు రవిశాస్త్రిని ఆడేసుకోవడం మొదలుపెట్టారు.

Ravi sastri Duplicate

అదీ అసలు విషయం…

మనుషులను పోలిన మనుషులను ఇప్పటికే మనం చాలా మందిని చూశాం. అచ్చంగా అలానే ఉండే మనిషిని చూసి చాలాసార్లు షాక్‌ అయిపోయాం. ఆర్జీవీ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్‌ సినిమాకూ అచ్చంగా చంద్రబాబులా ఉండే అతను దొరికాడు. ఇలాంటి ఎన్నో సంఘటనలు మనం చూశాం. అచ్చంగా రవిశాస్త్రిలా ఉండే వ్యక్తి ఇప్పుడు తారసపడ్డాడు. ఈ రవిశాస్త్రి డూప్‌ పేరు వర్మ. ముంబైలో ఉంటాడు. సబర్బన్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఇతడిని ఎవరో ఫోటో తీసి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అంతే అది కొన్ని గంటల్లోనే వైరల్‌ అయిపోయింది.

ఆడేసుకున్నారు…

వైరల్‌ అయిన రవిశాస్త్రి డూప్‌ ఫోటోను నెటిజర్లు ఒకాట ఆడుకుంటున్నారు. ఫన్నీ మెమ్స్‌, ట్రోల్స్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు. 2019 ప్రపంచకప్‌ తర్వాత రవిశాస్త్రి ఇలానే ఉంటాడని కొందరూ, అన్ని ఫార్మాట్లకూ రోహిత్‌ కెప్టెన్‌ అయితే రవిశాస్త్రి పరిస్థతి ఇదేనంటూ మరికొందరూ, డ్రింక్స్‌ పార్టీకి కోహ్లీ పిలవకపోడంతో అలిగి వెళ్లిపోతున్నాడని ఇంకొదరూ… ట్రోల్ చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *