అరవై ఏళ్లు భార్యముందు మూగవాడిగా నటించాడు!

అరవై ఏళ్లు భార్యముందు మూగవాడిగా నటించాడు!

అతను గొప్ప నటుడు. ప్రపంచంలో మరే నటుడు అతనికి సాటిరాడు. ఎందుకంటే..సినిమాల్లో, టీవీల్లో నటించే వారు ఒక గంట లేకుంటే అరగంట నటిస్తారు. కానీ అమెరికాకు చెందిన వ్యక్తి ఏకంగా 62 ఏళ్లు నాటకమాడాడు.ఇది ప్రపంచమంతా నివ్వెరపోయే విషయం.అది కూడా భార్యకు తెలియకుండా ఉండటం కోసం ఈ నాటకాన్ని 62 ఏళ్లు కొనసాగించాడు.ఇదెలా సాధ్యమో తెలీదు కానీ ఇంత గొప్పగా నటించినందుకుం ఆత్రం అతనికి ఆస్కార్ కన్నా గొప్ప అవార్డు ఏదైనా ఇచ్చేయచ్చు.

భార్య చెప్పే మాటలు వినకుండా తప్పించుకోవడానికని మూగ,చెవిటి వాడిలాగా నటించాడు.అలా నటించే ఇన్నేళ్లు భార్యతో ఏ చీకూ చింత  లేకుండా బ్రతికాడు.పైగా భార్యకు కొంచెం కూడా అనుమానించలేదు.అంత జాగ్రత్తగా ఉన్నాడు.అయితే నిజం ఎప్పుడూ దాగదు కదా! ఇన్నేళ్ల తర్వాత ఇపుడు బయటపడింది. దీంతో ఆమె అతనికి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది.

గొడవ పడలేక…

అమెరికాలోని వాటర్‌బ్యూరీకి చెందిన బ్యారీ డాసన్‌కు 84 ఏళ్లు. అతని భార్య డోరతీకి 80 ఏళ్లు.ఆమెతో గొడవ పడలేకనో మరే కారణమో తెలీదు కానీ, ఇన్నేళ్లు సైలెంట్‌గానే కాపురం చేశాడు. అతన్ని ఇబ్బంది పెట్టలేక ఆమె సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంది.భార్యా,భర్త మధ్య మాటలేవీ లేవు కాబట్టి ఇద్దరు సఖ్యంగా,ఎలాంటి గొడవలు లేకుండా గడిచింది.పైగా వీరికి ఆరుగురు పిల్లలు. 13 మంది మనవళ్లు కూడా ఉన్నారు. వాళ్ల ఇంట్లోని వారు కూడా డాసన్‌ని మూగవాడనే భావించారు.కానీ ఈ మధ్య ఒకసారి యూట్యూబ్ లైవ్‌లో ఆమె కంటికి దొరికిపోయాడు.అనుకోకుండా యూట్యూబ్ ఆన్‌చేసిన డోరతీకీ ఒక బారులో పాల్గొని పాట పాడుతున్న డాసన్ కనిపించాడు.చారిటీ మీటింగ్ అని చెప్పి బారులో పాటలు పడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.అంతే…ఇన్నేళ్లు మోసం చేశాడంటూ అతనికి విడాకులు ఇచ్చింది డోరతీ.

ఈ అంశం గురించి మాట్లాడుతూ..’డాసన్‌తో మాట్లాడేందుకు రెండు కళ్లు, కొన్నేళ్లు కష్టపడి సైన్ లాంగ్వే నేర్చుకున్నాను.నేను సైగలు చేస్తే డాసన్‌కి అర్థమయ్యేది కాదు.తనకు చూపు కూడా మందగించింది అని చెప్పాడు.ఇపుడు అది కూడా నాటకమే అని తేలిపోయింది.అందుకే అతనితో విడాకులు తీసుకోవాలని ఆశిస్తున్నాను.62 ఏళ్ల పాటు అంత బాగా ఎలా నటించాడో తెలీదు కానీ సోషల్ మీడియాల్లో తెలిసిన నెటిజన్లు మాత్రం అతన్ని మగజాతి ఆణిముత్యం అని పోగిడేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *