విమానం కిటికీ తెరిచాడంతే..!

విమానం కిటికీ తెరిచాడంతే..!

ఎక్కడికైనా ప్రయణం చేస్తున్నపుడు బస్సు కిటికీ తెరిస్తే చల్లగా గాలి వీస్తుంది. అప్పటిదాకా ఉన్న అలసట మొత్తం పోతుంది. ప్రయాణాల్లో ఇలాంటి అనుభవం అందరికీ ఉంటుంది. ఇదే పని విమానంలో ఉన్నపుడు చేయగలరా..! అంత ధైర్యం ఎవరూ చేయలేరు. కానీ..ఒక వ్యక్తి చేశాడు. ఆ కథాకమామీషు తెలుసుకుందాం!

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సునీల్‌కుమార్ అనే వ్యక్తి లక్నోకు వెళ్లడానికి సిద్ధం అయ్యాడు. అన్ని చెకింగ్‌లు అయ్యాక గోఎయిర్ విమానంలోకెళ్లి తన సీట్‌లో కూర్చున్నాడు. కాసేపటికి ఉక్కగా ఉందని విమానంలో ఉండే ఎమర్జెన్సీ కిటికీని తెరిచాడు. దీన్ని విమాన సిబ్బంది గమనించి వెంటనే కిటికీని మూసేశారు. ఈ ఘటన విమానం టేకాఫ్ చేయకముందు జరగడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు.

వెంటనే సునీల్‌ను విమానం నుంచి కిందికి దించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. అయితే…సునీల్‌కు ఆ కిటికీ తెరవకూడదన్న విషయం తెలీయకే ఇలా చేశానంటూ మొరపెట్టుకున్నాడు. తాను తొలిసారి విమానం ఎక్కానంటూ…గాలి తగలకపోవడం వల్లే విండో డోర్ తెరిచానంటూ ఇక వేరే ఉద్దేశ్యం ఏమీ లేదని విమానాశ్రయ అధికారులకు వివరించాడు. ఆ తర్వాత అతన్ని వేరే విమానంలో లక్నోకు పంపించారు. ఈ సంఘటనపై గోఎయిర్ సంస్థ ప్రయాణికులకు క్షమాపనలు చెప్పింది. ప్రయాణికుడు తెలియక చేసిన పొరపాటు కావడంతో దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *