నీట మునిగిన పడవ.. ఏడుగురు గల్లంతు

నీట మునిగిన పడవ.. ఏడుగురు గల్లంతు

లిబియాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాద వశాత్తు పడవ మునిగి ఏడుగురు గల్లంతయ్యారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం ఇద్దరి మృతదేహాల్ని వెలికితీశారు. గర్రాబుల్లీ పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో 80 మంది వలసదారులు పడవలో ప్రయాణం చేస్తున్నారు. దీంతో అది ప్రమాదవశాత్తూ నీటిలో మునిగింది. ఈ ఘటనలో లిబియన్ కోస్ట్ గార్డ్స్ 73 మందిని రక్షించారు. పడవలో ఉన్న వారిలో ఏడుగురు గల్లంతయ్యారు. ఇందులో ఇద్దరి మృతదేహాలను లిబియన్ కోస్ట్ గార్డులు వెలికితీశారు. వెలికితీసిన మృతదేహాల్లో ఒకరు మహిళ, మరొకరు చిన్నారిగా గుర్తించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *