మళ్లీ సునామీ హెచ్చరికలు

మళ్లీ సునామీ హెచ్చరికలు

సునామీ సృష్టించే బీభత్సానికి ఎవరైనా సరే వణికిపోతారు. ఆ ఆలోచనే వెన్నులో వణుకుపుట్టిస్తుంది. వేల మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్న సునామీలను మనం గతంలో చూశాం. గంభీరంగా ఉండే సముద్రుడు హఠాత్తుగా విరుచుకు పడి, చూపే అలజడికి ఎన్నోసార్లు అల్లాడిపోయాం. ఇప్పుడు మళ్లీ మరో సునామీ విరుచుకుపడనుందనే హెచ్చరికలొస్తున్నాయి.

New Caledonia

భారీ భూకంపం…

సునామీ రావడానికి ముందుగా ప్రకృతి కొన్ని ముందుస్తు హెచ్చరికలనిస్తుంది. పసిఫిక్‌ మహాసముద్రంలోని వనౌటూ, న్యూ కలెడోనియా దీవుల్లో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.6 నమోదై మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. లాయాలిటీ దీవులకు దగ్గర్లో భూకంప కేంద్రాన్నిగుర్తించారు. ఇది పదిమీటర్ల లోతుగా ఉండటంతో, దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు. సునామీ వచ్చే అవకాశాలూ ఉన్నాయని పసిఫిక్‌ సునామీ వార్నింగ్‌ సెంటర్‌​ హెచ్చరించింది. అస్ట్రేలియాకు తూర్పువైపున్న దీవులకు ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతలకు తరలించే ఏర్పాట్లనూ ప్రారంభించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *