మునిగిపోయిన ముంబై.. స్తంభించిన మహానగరం..

మునిగిపోయిన ముంబై.. స్తంభించిన మహానగరం..

ముంబాయిని వానలు ముంచెత్తుతున్నాయి. వర్షందాటికి దేశ ఆర్థిక నగరం అతలాకుతలమైంది. వరుణుడి కోపానికి ప్రాణాలు ఆకులు రాలినట్టు రాలుతున్నాయి. ప్రభుత్వ సహయక చర్యలు కొనసాగిస్తుంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సీఎం కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

ముంబాయిలో వర్షాలు ఇంకా దంచికొడుతున్నాయి. నగరంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. NDRF‌, నావికా దళ సిబ్బందిని రంగంలోకి దింపింది. ఇంకాఅతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల కుర్లా క్రాంతినగర్‌లోని 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొన్ని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కూడా తరలించారు.

ఇప్పటి వరకు వర్షం కారణం చనిపోయి వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. పింపిరీపాడ ప్రాంతంలో గోడ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. వర్షం కారణంగా పలు ఘటనల్లో మృతుల సంఖ్య 44కి చేరింది. మరింత పెరిగే అవకాశముంది. మరోవైపు రహదారులన్నీ జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రోడ్డు, రైలు మార్గాలతో పాటు విమాన సేవలు కూడా నిలిచిపోయాయి. 54 విమాన సర్వీసులను దారిమళ్లించినట్లు ముంబయి విమానాశ్రయ వర్గాలు ప్రకటించాయి.

వర్షాలు ఎడతెరుపు లేకుండా కురవటంతో ఇంకా ఎన్నిరోజులు ఈ వానల్లో బతికేదంటూ జనం ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మలాడ్‌లో గోడ కూలిన ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందంటూ ఆయన ట్వీట్ చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *