ఒక్క ఓవర్‌లో 43 పరుగులు

ఒక్క ఓవర్‌లో 43 పరుగులు

క్రికెట్‌ గురించి కాస్త అవగాహన ఉన్న వాళ్లైనా… ఈ వార్త వినగానే షాక్‌ అయిపోతారు. ఉన్న ఆరు బంతులనూ ఆరు సిక్సర్లు బాదినా 36 పరుగులే వస్తాయి. అలాంటిది ఒకే ఒవర్లో ఏకంగా 43 పరుగులు రాబట్టడమంటే అది మామూలు విషయం కాదు. రికార్డులని తిరగ రాసుకోవాల్సిన సంగతే అవుతుంది. ఈ వీరబాదుడు గురించి చెప్పాక… ఆ ఆటగాడెవరో తెలసుకోవాలని ఉందా… అన్ని పరుగులు సమర్పించుకున్న బౌలర్‌ పేరు ఒకసారి విందామని ఉందా… అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సందే. 

అలా బాదారు…

ఈ ఘణత న్యూజిలాండ్‌ దేశవాలీ వన్డేలో చోటు చేసుకుంది. ఈ బుధవారం సెంట్రల్‌ డిస్ట్రిక్‌ జట్టుకూ నార్తెర్న్‌ డిస్ట్రిక్‌ జట్టుకూ మధ్య వన్డే మ్యాచ్‌ జరిగింది. నార్తెర్న్‌ డిస్ట్రిక్‌ జట్టు తరపున ఆడిన ఆటగాళ్లు జో కార్టర్‌, బ్రెట్‌ హంప్టన్‌లు ఈ అద్భుత రికార్డును సృష్టించారు. వీరిద్దరి వీరబాదుడు ధాటికి సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ పేసర్‌ విలియమ్‌ లుడిక్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మిగిలాడు. లుడక్‌ వేసిన ఓవర్లో 4, 6+nb, 6+nb, 6, 1, 6, 6, 6లతో 43 పరుగులు రాబట్టి, చరిత్ర సృష్టించారు. అప్పటి వరకూ పొదుపుగా బౌలింగ్‌ చేసిన లుడక్‌ మొత్తం పది ఓవర్లలో 85 పరుగులు ఇచ్చాడు. ఈ ఇద్దరు విధ్యంసక ఆటగాళ్లలో కార్టర్‌(102 నాటౌట్‌) సెంచరీ సాధించాడు. హంప్టన్‌ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.

ఆ ఓవరే గెలిపించింది…

తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్తెర్న్‌ డిస్ట్రిక్‌, ఈ ఇద్దరి అద్భత ఇన్నింగ్స్‌తో 313 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు వచ్చిన జట్టు 288 పరుగులు చేసి, పరాజయాన్ని మూటకట్టుకుంది. లుడక్‌ వేసిన ఓవర్లో బాదిన 43 పరుగులే విజయానికి కీలకమయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *