పక్షిరాజు చెప్పిందే నిజమైంది..! 5G టెస్ట్... 300 పక్షులు మరనించాయి

పక్షిరాజు చెప్పిందే నిజమైంది..! 5G టెస్ట్... 300 పక్షులు మరనించాయి

‘పిడికెడంత ఉండే పిట్టే మన మధ్య బతకలేనప్పుడు… మనం ఎంత అభివృద్ధి చెంది మాత్రం ఏం లాభం…’ ఇది రజినీ 2.0 సినిమాలో పక్షిరాజు పాత్ర చెప్పే డైలాగ్. ఆ సినిమాలో సెల్‌ఫోన్ల కారణంగా లక్షల్లో పక్షులు మరణిస్తున్నాయని వాపోతాడు. మొబైల్ వాడే ప్రతీ మనిషి ఒక హంతకుడే అని ఆవేదనగా చెబుతాడు. దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని సెల్‌ఫోన్ల కంపెనీలు…తమ బ్రాండ్ వాల్యూని దెబ్బతీస్తుందని 2.0 సినిమా నిర్మాతలమీద, దర్శకుడిమీద దావా కూడా వేశాయి. కానీ, సినిమాలో చెప్పినట్టుగానే టెక్నాలజీ వల్ల ఎన్నో పక్షులు, జంతువులు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయనే మాటను నిజం చేస్తూ తాజాగా ఓ ఘటన వైరల్ అయింది.

5g test effect

సెకన్ల వ్యవధిలో 300 పక్షులు…

నెదర్లాండ్‌లో కొన్ని రోజుల క్రితం 5G ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం కారణంగా దాదాపు 300 పైగా పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ ప్రయోగం చేసిన సమయంలో నెదర్లాండ్‌లో ఆకాశం నుంచి కొన్ని పక్షులు ఉన్నట్టుండి నేల మీదకు రాలిపడ్డాయి. ఒక్కసారిగా ఇన్ని వందల పక్షులు నేలమీద పడటంతో అక్కడి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వాటన్నిటినీ అలా చూసిన ప్రజల హృదయం విలవిల్లాడింది. డచ్ రైల్వే స్టేషన్ పరిధిలో 5G ప్రయోగం అని చెప్పి కొన్ని సెకన్ల పాటు సిగ్నల్ చెకింగ్ చేశారు. అది జరిగిన వెంటనే ఆ ఫ్రీక్వెన్సీని తట్టుకోలేక ఒక్కసారిగా పక్షులు ప్రాణాలు పోగొట్టుకున్నాయి. ఆకాశంలోని పక్షులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోని కొలనుల్లో బాతులు కూడా నీళ్లలో మునిగి మరణించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సెకనుకి మిలియన్ల మైక్రోవేవ్స్ రిలీజి చేసే 5G నెట్‌వర్క్ వల్ల ఆ ఒత్తిడిని తట్టుకోలేని మూగజీవాలు ప్రాణాలు విడిచినట్టు అంచనా వేస్తున్నారు. ఇదంతా చూస్తే 2.0 సినిమాలో పక్షిరాజు పక్షుల కోసం ఎంత విలవిల్లాడాడో తెలుస్తుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *