హోమంలో బెలూన్ మంటలు

హోమంలో బెలూన్ మంటలు
ఒక కార్యక్రమం జరిగేపుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటికి పదిసార్లు అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. కర్ణాటకలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగింది. మైసూర్‌లోని సుత్తూర్ మఠ్‌లో కొన్ని రోజుల క్రితం హోమం నిర్వహించారు. దీనికోసం చాలామంది ప్రముఖులు కూడా హాజరయ్యారు.
అక్కడివరకూ శాంతంగా జరిగిన కార్యక్రమంలో హఠాత్తుగా అపశృతి ఏర్పడింది. హోమగుండాన్ని వెలిగించిన కొన్ని సెకనలో ఆ మంటల ధాటికి అక్కడే వేలాడేసిన బెలూన్లను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

స్వల్పంగా

బెలూన్లలో హైడ్రోజన్ వాయువు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. సరైన జాగ్రత్త లేకుండా హోమగుండానికి దగ్గరగా ఆ బెలూన్‌లను కట్టి ఉంచడంతో మంటలు తాకగానే బెలూన్‌లు కూడా పేలిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గిరికి స్వల్పంగా గాయాలయ్యాయి. దీనికి సంబందించిన వీడియో జాతీయా వార్త సంస్థ షేర్ చేయడంతో…నెటిజన్లు వారి బాధ్యతారాహిత్యాన్ని గుర్తుచేస్తూ సెటైర్లు వేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *