కీడ్నీ రాకెట్‌ వెనుక సూత్రదారులు ఎవరు?

కీడ్నీ రాకెట్‌ వెనుక సూత్రదారులు ఎవరు?

ఆర్థిక అవసరాలే ఆసరాగా మధ్యతరగతి జీవుల కిడ్నీలు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు . యాంత్రిక జీవనంలో భాగంగా ఆహారపు అలవాట్లు మారడంతో కిడ్నీ సమస్యల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. అదే అదనుగా కొన్ని ముఠాలు కిడ్నీల బిజినెస్‌ చేస్తున్నాయి. కిడ్నీలు చెడిపోయిన బడాబాబుల దగ్గర లక్షలకొద్దీ బేరమాడుకుని పేదోళ్ల కిడ్నీలు కొట్టేస్తున్న గ్యాంగ్‌ల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా విశాఖలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ భాగోతంలో నివ్వెరపోయే నిజాలు బయటపడుతున్నాయి. అసలు ఈ కీడ్నీ రాకెట్‌ వెనుక సూత్రదారులు ఎవరు? ఎన్నాళ్లు నుంచి ఈ వ్యాపారం చేస్తోన్నారు?

విశాఖలో కిడ్నీ మార్పిడికి కేంద్రం ముసుగులో కిడ్నీ రాకెట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. కాసుల కోసం హస్పటల్స్‌ అడ్డదారులు తొక్కుతున్నాయి. ఏళ్ల తరబడి ఇదో వ్యాపారంగా పెట్టుకుని ఏటా కోట్లాది రూపాయలు ఆర్జిస్తోంది. కాలం కలిసిరాక ఇప్పుడు అడ్డంగా బుక్కయిపోయారు. సాధారణంగా ఒక కిడ్ని చెడిపోయినా కూడా, మరో కిడ్నీతో సాధారణ జీవితం గడిపేయొచ్చు. కానీ, రెండు కిడ్నీలు చెడిపోతే మాత్రం జీవితం దుర్భరంగా మారుతుంది. అలా రెండు కిడ్నీలు పనిచేయనివాళ్లు డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. పేషెంట్ల కండిషన్ బట్టి వారానికి ఒకరోజు, లేదంటే వారానికి రెండు మూడు సార్లు కూడా డయాలసిస్ అవసరమవుతుంది. రక్తం శుద్ధి చేయడానికి ఓ యంత్రం ఉంటుంది. పేషేంట్ల రక్తం ఆ మెషీన్ లోకి పంపించి శుద్ధి చేసి తిరిగి వారి శరీరంలోకి పంపించే ప్రక్రియను డయాలసిస్ అంటారు. అలా డయాలసిస్ ప్రాసెస్ అనేది అంతా ఈజీ కాదు. ఒకోసారి ప్రాణాలకు కూడా డేంజరే.

అయితే డబ్బున్నవాళ్లు డయాలసిస్ కష్టం భరించరు. లక్షల రూపాయలు పోయినా సరే ఇతరుల నుంచి కిడ్నీ కొనుక్కుందామనే ధోరణితో ఉంటారు. ఆ క్రమంలో నేరుగా కిడ్నీదాతలు దొరకరు కాబట్టి బ్రోకర్లను ఆశ్రయిస్తారు. అందుకే బ్రోకర్లకు కాసుల పంట పండుతోంది. అది చట్టవిరుద్ధమైనా కూడా, అవసరమైన పత్రాలు ఫోర్జరీ చేస్తూ, డూప్లికేట్ తీస్తూ కిడ్నీ ఆపరేషన్లకు తెర తీస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని.. కిడ్నీ దందా చేస్తున్నారు. అయితే కిడ్నీ కావాలనే సమయంలో వారితో మంచిగా మాట్లాడుతూ, అధిక మొత్తం ఆశజూపుతూ.. తీరా ఆపరేషన్ పూర్తయ్యాక మాత్రం హ్యాండిస్తున్నారు. మొదట మాట్లాడినదాని కంటే తక్కువగా ఇస్తున్న బ్రోకర్లు లక్షలకు లక్షలు గడిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసేవారు తక్కువగా ఉంటే.. ఎంత కొంత వచ్చిందిలే అని సర్దుకుపోయేవాళ్లు ఎక్కువగా ఉన్నారు.

మరోవైపు ఇప్పటికే విశాఖలో కిడ్నీ రాకెట్‌ ఉదంతంపై జిల్లా కలెక్టర్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. తమ విచారణకు ఈ కమిటీ సహకరిస్తోందని ఏపీ డీజీపీ ఠాకూర్ ప్రకటించారు.ఈ కేసులో త్రిసభ్య కమిటీ విచారణ చేసి కలెక్టర్‌కు నివేదికను అందించనుంది. అదే సమయంలో కిడ్నీ రాకెట్‌లో పోలీసుల విచారణకు అవసరమైన టెక్నికల్ సహాయాన్ని కూడ ఈ కమిటీ అందించనుంది.ఈ కేసులో ఎవరినీ కూడ ఉపేక్షించబోమని కూడ ఏఫీ డీజీపీ ఠాకూర్ ఇప్పటికే చెప్పారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *