"రోబో 2.o" మూవీ రివ్యూ

"రోబో 2.o" మూవీ రివ్యూ

సూపర్ స్టార్ రజినీకాంత్ టైం అసలు బాగోలేదు, ఇక ఆయన పని అయిపొయింది, సినిమాలు మానేయడం బెటర్.. గత రెండు మూడేళ్ళుగా రజిని గురించి వినిపిస్తున్న మాటలు.. అయితే ఆ విమర్శలన్నింటికీ సూపర్ స్టార్ రోబో 2.0 సినిమాతో సమాధానం చెప్తాడని ఆయన అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.. ఆ ఎదురు చూపుని నిజం చేస్తూ చాలా సార్లు వాయిదా పడిన రోబో 2.0 సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి రజిని కంబ్యాక్ అయ్యాడా? శంకర్ విజువల్ వండర్ సృష్టించాడా లేదా చూద్దాం.

2pointO Review

మొదటి భాగం…

భారీ స్టార్ కాస్ట్, భారీ బడ్జట్, ఇండియన్ స్క్రీన్ పై ముందెన్నడూ చూడని vfx వర్క్ లాంటి స్పెషల్ ఎలిమెంట్స్ తో వచ్చిన రోబో 2.0 సినిమా… మొదటి భాగం ఎక్కడ ముగుస్తుందో అక్కడే మొదలయ్యింది.. రోబో సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ కన్నా మంచి కంటెంట్ ఉంది.. టెక్నాలజీ వలన జరిగే మేలు ఎంతుందో, నష్టాలు కూడా అంతే ఉన్నాయి… వాటిలో రేడియేషన్ సమస్య ఒకటి… ఈ రేడియేషన్ కారణం పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి.. ప్రపంచం మనుషులది మాత్రమే కాదు వాటిది కూడా అని పోరాడిని పక్షి రాజు అనే ఆర్నిథాలజిస్ట్ చివరికి ఆ పోరాటంలో ఓడిపోయి.. పక్షులు దెబ్బతినడానికి కారణమైన ఫోన్ల పైన, వాటిని వాడుతున్న మనుషుల పైన కోపం వచ్చి ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య చేసుకుంటాడు.. తన మరణాంతరం 5th ఫోర్స్ గా మారిన పక్షి రాజు… మానవాళి అంతానికి ఎలాంటి పనులు చేశాడు? ఆ పక్షి రాజుని డాక్టర్ వశీకరన్ చిట్టి సాయంతో ఎలా అడ్డుకున్నాడు అనేదే రోబో 2.0 సినిమా కథ.. పక్షి రాజు మరణంతో మొదలైన రోబో 2.0 కథనం, ఆధ్యంతం వినోదంతో కూడిన సందేశం ఇస్తూ, భారీ పోరాట సన్నివేశాలతో ఆశ్చర్యపరుస్తూ సాగిపోయింది.

విజువల్ వండర్ చూపించిన శంకర్

ఇండియన్ బెస్ట్ డైరెక్టర్స్ లో ఒకడైన భారీ చిత్రాలు దర్శకుడు శంకర్ రోబో 2.0 సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. 500 కోట్ల బడ్జత్ తో హై టెక్నీకల్ వాల్యూస్ ని చూపిస్తూనే తన మార్క్ సోషల్ ఎలిమెంట్ ఎక్కడా మిస్ కాకుండా రాసుకున్న శంకర్… గ్రాఫిక్స్ ని కథని సమపాళ్లలో నడిపించడంలో పూర్తిగా సక్సస్ అయ్యాడు.. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా vfx వర్క్ లో కొన్ని లోపాలు కనిపించినా కూడా రోబో 2.0 డెఫినెట్లి ఇండియాస్ బెస్ట్ ఫిల్మ్ టిల్ డేట్. ఇంత భారీ బడ్జట్ తో తెరకెక్కిన ఈ సినిమా శంకర్ కెరీర్ లోనే అతితక్కువ రన్ టైం ఉన్న మూవీ. మాములుగా 2 గంటల 40 నిమిషాలకి తక్కువ నిడివితో ఉన్న సినిమాలని చేయని శంకర్, రోబో 2.0 సినిమాని మాత్రం రెండున్నర గంటల్లోనే పూర్తి చేశాడు. రెహ్మన్ సంగీతం అంతంతమాత్రంగా ఉన్నా కూడా రసూల్ పూకుట్టి తన మ్యాజిక్ తో రెహ్మాన్ లోపాలని కనిపించకుండా చేశాడు.

నటీనటులు…

ఇక నటీనటులు విషయానికి వస్తే పక్షిరాజుగా అక్షయ్ కుమార్ మంచి రోల్ ప్లే చేసారు, 5th ఫోర్స్ గా, పక్షిని ప్రేమించే వ్యక్తిగా అద్భుతంగా నటించి మెప్పించాడు, వెన్నెలగా నటించిన అమీ జాక్సన్ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రనే చేసింది, కథలో ఆమెకి పెద్దగా స్కోప్ లేకపోయినా కూడా కథనంలో ఇంపార్టెంట్ సీన్స్ లో కనిపించే వెన్నెల పాత్రకి అమీ తనవంతు న్యాయం చేసింది… ఇక చివరగా కచ్చితంగా చెప్పుకోవాల్సింది మన సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి చిట్టిగా, రెలోడెడ్ వెర్షన్ 2.0గా అద్భుతంగా కనిపించి మెప్పించాడు, చాలా రోజులుగా రజిని స్టైల్ మిస్ అవుతున్న ఫ్యాన్స్ కి ఇది విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ముఖ్యంగా కుట్టి రోబోగా, రోబో అప్డేటెడ్ వెర్షన్ గా సినిమా పీక్ స్టేజ్ లో ఉండగా తెరపై కనిపించిన చిన్న రోబో నిజంగా ఒక సర్ప్రైసింగ్ ఎలిమెంట్. చిట్టి రెలోడెడ్ వెర్షన్ బయటికి వచ్చాక సినిమా పూర్తిగా రజినీ స్వాగ్ తోనే నడుస్తుంది, పంచ్ డైలాగ్స్ కానీ తను చేసే డిఫరెంట్ సౌండ్స్ కానీ అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలి అంటే రజినీకాంత్ లేని రోబోని ఊహించడం కష్టమే.

2.o review

రోబో 3.0 ఉండే అవకాశాలు

ఇన్ని రోజులు ఇంత టెక్నీకల్ సినిమా మాస్ ఆడియన్స్ కి బీ సి సెంటర్స్ లోని ప్రేక్షకులని ఎలా ఎక్కుతుందో అనుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు, సినిమా చూశాక మాత్రం అందరికి రీచ్ అయ్యే కంటెంట్ ఉన్న సినిమా ఈ రోబో 2.0 అని చెప్పొచ్చు… మొత్తానికి భారీ బడ్జట్ తో అంతకు మించిన అంచనాలతో వచ్చిన రోబో 2.0 సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించగలదు, మరి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6800 థియేటర్స్ లో రిలీజ్ అయిన రోబో 2.0 సినిమా మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ తెచ్చుకుంటుంది, ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ చేరుతుంది అనేది చూడాలి. ఇక కాసేపు రోబో 2.0 విషయం కాస్త పక్కన పెడితే ఇప్పటికే 3.0 కూడా ఉంటుందని కన్ఫర్మ్ చేసిన శంకర్… అందుకు అవసరమైన భారీ లైన్ ని 2.0 ఎండింగ్ లో చిన్న హింట్ ఇచ్చి వదిలేశాడు.. చిట్టి లాంటి 5000 రోబోలని మిలిటరీలో సైనికులుగా పంపించే సన్నివేశం రాసుకున్న శంకర్, 3.0లో రజినితో ఆర్మీ యుద్ధాలు చేయిస్తాడా లేక కుట్టి రోబోతో సరికొత్త మాయాజాలం చేస్తాడా అనేది ఆసక్తి కలిగించే అంశం… ఆర్మీ సైడ్ వెళ్లినా, కుట్టి రోబోతో నడిపించినా రోబో 3.0 లైన్ కానీ స్టాండర్డ్స్ కానీ మరోసారి ప్రపంచానికి మన సినిమా సత్త్త ఏంటో చూపించేలాగే ఉంటాయని చెప్పొచ్చు.. మరి శంకర్ 3.0 ఎప్పుడు మొదలు పెడతాడు? ఎన్నేళ్ళకి పూర్తి చేస్తాడు అనేది చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *