భారత్ ను వణికిస్తున్న జికా వైరస్

భారత్ ను వణికిస్తున్న జికా వైరస్

భారత్ లో జికావైరస్ కలకలం రేపుతోంది. రాజస్థాన్, బీహార్ రాష్టాల్లో ఇప్పుడు జికావైరస్ ఉందన్న వార్తలు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో జికా వైరస్ వ్యాపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 5వతేదీ నుంచి రాజస్థాన్ రాష్ట్రంలో 22 జికా వైరస్ పీడితులు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు చెందిన ఏడుగురు వైద్యుల బృందాన్ని జైపూర్ కు పంపించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రంలో గర్భిణులకు ఈ వైరస్ సోకకుండా అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. 86 దేశాలను గడగడలాడిస్తున్న జికా వైరస్ నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని మంత్రి నడ్డా వివరించారు.

22కి చేరింది…

జికా వైరస్‌ దేశంలో పంజా విసురుతోంది.  గతనెలలో తొలికేసు నమోదైన రాజస్థాన్‌ రాజధాని నగరం జైపూర్లో  జికా విజృంభిస్తోంది. ఇది మరిన్ని రాష్ట్రాలకు సోకనుందనే  వార్తలు మరింత ఆందోళన పుట్టిస్తున్నాయి. జైపూర్లో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య తాజాగా 22కి చేరింది. ఇప్పటివరకూ 22 కేసులను గుర్తించామనీ, ఎన్‌సీడీసీ పరిస్థితిని సమీక్షిస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ  జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది  దీంతో రంగంలోకి దిగిన కేంద్రం  సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా కోరింది.

zika virus

బీహర్ లోనూ…

తాజాగా  22 మందికి పాటిజివ్‌ గా తేలడంతో ప్రధానమంత్రి కార్యాలయం  ఒక నివేదికను కోరిందని అధికారులు వెల్లడించారు. అటు ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీ)  లో ఒక కంట్రోల్‌ రూంను ఏర్పాటుచేయడంతో పాటు  ఒక ఉన్నతస్థాయి కమిటీ జైపూర్‌కు తరలి వెళ్లింది. మరోవైపు బీహర్ లోనూ  జికా వైరస్‌ లక్షణాలు కనిపిస్తుండటంతో అక్కడి జిల్లా ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. దాదాపు 38 జికా అలర్ట్‌ జారీ చేశారు. జికా వ్యాధి లక్షణాలు కనిపిస్తే  వెంటనే వైద్యులను సంప్రదించాలనీ,  జాగ్రత్తలు తీసుకోవాలని  అధికారులు కోరారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *