వెల్లుల్లిని ఒలవడం ఇంత సులభమా! వైరల్ అవుతున్న వీడియో

వెల్లుల్లిని ఒలవడం ఇంత సులభమా! వైరల్ అవుతున్న వీడియో

సోషల్ మీడియాలో తలలు దూర్చేస్తున్న జనరేషన్‌లో ఎలాంటి విషయం, ఎందుకు విపరీతంగా ప్రచారం సాధించుకుంటుందో చెప్పలేం. చాలా చిన్న చిన్న సంఘటనలు కూడా ఎక్కువ ప్రాచూర్యం సంపాదించి అందరూ వాటిని షేర్ చేసుకునేలా వైరల్ అవుతుంది. తాజాగా ఓ వెల్లుల్లి వీడియో తెగ వైరల్ అయింది. వెల్లుల్లిని తక్కువ సమయంలో ఎలా ఒలవాలో ఇందులో చూపించారు.

సాధారణంగా వెల్లుల్లి పాయలను ఒలిచేందుకు ఎక్కువ సమయం పట్టదు. దాన్ని పాయలుగా తీసి, దాని తొక్కను తీయాలంటే చాలా ఓపికతో చేయాల్సిన పని. కొన్నిసార్లు చేతి వేళ్లు కూడా మంటలు పుడతాయి. అయితే, అలాంటి శ్రమ లేకుండా కొన్ని సెకన్ల వ్యవధిలో వెల్లులిపాయలను వలిచేయొచ్చని ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెల్లుల్లిని ఒలిచేందుకు చెఫ్‌లు రకరకాల మార్గాల్లో ప్రయత్నిస్తారు. సీసాలో పెట్టి వెల్లుల్లిపాయలను షేక్ చేస్తారు. లేకుంటే వాటిని నీటిలో నానబెట్టి మైక్రో ఓవెన్‌లో పెట్టి తొక్క ఒలుస్తారు. అయితే, ట్విట్టర్‌లో ఈ మధ్యనే పోస్టు చేసిన ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతాం. ఆ వీడియోలో ఉన్న మహిళ చిన్న కత్తితో వెల్లుల్లిని చకచకా ఒలిచేసింది. వెల్లుల్లి పాయల మధ్యలో ఉండే సన్నని పొర మధ్యలోకి చాకును గుచ్చి..వెల్లుల్లిని స్పీడ్‌గా వెలికితీయడం నెటిజనులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *