కొండగట్టు లో వైభవంగా హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో పెద్ద హనుమాన్​ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు… స్వామికి పట్టు వస్త్రాలతో అలంకరించారు.

80 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

మంచిర్యాల జిల్లా తపాలపూర్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 80 క్వింటాల్లా రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముందుస్తు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా పొగలు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులుకు గురయ్యారు.అనంతరం ప్రయాణికులను ప్రత్యామ్నాయ బస్సులో ఉప్పల్ కు తరలించారు.