భార్యను దారుణంగా చంపిన భర్త

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వి.కోట మండలం దాసార్లపల్లిలో భార్యపై అనుమానంతో భర్త శ్రీనివాస్‌ గడ్డపారతో అతికిరాతకంగా పొడించి హత్య చేశారు. దీంతో భార్య వసంత అక్కడికక్కడే మృతిచెందింది. హత్య అనంతరం శ్రీనివాస్‌ పోలీసులకు లొంగిపోయాడు.

విజయవాడలో 1137 కిలోల గంజాయి పట్టివేత

విజయవాడ సమీపంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఇసుక లారీలో అక్రమంగా తరలిస్తున్న 1137 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు ఇసుక లారీలో గంజాయిని డీఆర్ఐ.. పక్కా ప్రణాళిక ప్రకారం పట్టుకున్నారు.

వైసీపీ విజయోత్సవ ర్యాలీలో అపశృతి...ఆటో డ్రైవర్ మృతి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రెండ్రోజుల క్రితం జరిగిన వైసీపీ విజయోత్సవ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. విజయోత్సవ ర్యాలీలో భాగంగా బాణసంచా పేలి ఆటో డ్రైవర్‌ చింతపల్లి మణికంఠ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఇదిలాఉంటే ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మనికంఠ ఇవాళ మృతి చెందాడు.