ఐదో అంత‌స్తుపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు జిల్లా నంద్యాల సలీంనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. సన్నీ మోహిత్ అనే ఇంటర్ విద్యార్థి బిల్డింగ్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే సూసైడ్‌కు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

ఏనుగుల గుంపు సంచారం...భయాందోళనలో గ్రామస్థులు

విజయనగరం జిల్లాలో మరోసారి ఏనుగులు గుంపు హల్‌చల్‌ చేసింది. కుందరతిరువాడ గ్రామంలోకి ప్రేవేశించిన ఏనుగులు.. గొర్లి రామినాయుడు చెరుకు తోటను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఏనుగులు గుంపులుగా రావడంతో స్థానికులు హడలిపోతున్నారు. ఏ క్షణంలో ఊరి మీద పడతాయో అని భయంతో…

200 కిలోల గంజాయి పట్టివేత

కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలం కీసర వద్ద పోలీసులు తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. కారులో తరలిస్తున్న రెండు వందల కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.      

బయటపడిన బ్రిటీష్‌ కాలం నాటి తుపాకులు

తూర్పుగోదావరి జిల్లాలో బ్రిటీష్‌ కాలం నాటి తుపాకులు బయటపడ్డాయి. కాకినాడలోని విద్యుత్‌ నగర్‌లో ఓ భవనం నిర్మించేందుకు పిల్లర్ల కోసం భూమిని తవ్వతుండగా.. శిథిలమైన పది తపాకులు బయటపడ్డాయి. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వాటిని స్వాధీనం చేసుకున్నారు.