వాసన చూస్తే ఆకలి మటుమాయం!

వాసన చూస్తే ఆకలి మటుమాయం!

1999లో మోహన్‌బాబు సినిమా ‘యమజాతకుడు’ వచ్చింది. అందులో బ్రహ్మానందం పాత్ర ఒక శాపానికి బలవుతాడు. ఒక రాక్షసి పాత్ర బ్రహ్మానందాన్ని శపిస్తుంది. బ్రహ్మానందం ఏదైనా తినాలని అనుకున్నప్పుడల్లా…ఆ పదార్థం తినకుండానే తిన్నట్టు భ్రమ కలిగిస్తుంది. అంటే…ఏదైనా తినాలని ప్రయత్నించగానే త్రేన్పు వచ్చి కడుపు నిండినట్టుగా అనిపించడం…నీళ్లు తాగుతుంటే దాహం తీరిపోవడం జరుగుతుంది. ఆయా సన్నివేశాల్లో హాస్యం బాగా పండింది. ఇపుడు అచ్చంగా అలాంటి పరిస్థితే దాపురించింది మనుషులకు. దీన్ని శాస్త్రవేత్తలే నిర్ధారిస్తున్నారు.

తినకుండా ఉండలేక…

లావు పెరగడం ఇప్పటివారిలో అతిపెద్ద సమస్యగా మారింది. ఎక్కువ తినేయడం అయ్యో తిన్నామని బాధపడటం ఒక పెద్ద సమస్య. ఆరోగ్యం బాగుండాలని, స్లిమ్‌గా కనబడాలని ఇష్టమైన ఆహారాన్ని తినకుండా నోరు నొక్కేసుకుంటున్నారు చాలామంది. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లినపుడో, అరుదైన మీటింగ్‌ల్లోనో నచ్చిన ఫుడ్ కనబడితే ఒక్కసారి తింటే ఏం కాదులే అని సర్ది చెప్పేసి లాగించేస్తున్నారు. మరుసటి రోజునుంచి మళ్లీ కథ మొదటికొస్తుంది.

health tips

వాసన చూసి తిన్నామనుకోవాలి…

దీనికి పరిష్కారం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తినకూడని వాటిని కూడా తిన్నామనే సంతృప్తిని పొందవచ్చని చెబుతున్నారు. నచ్చిన ఫుడ్ పిజ్జా, బిర్యానీ, బర్గర్ వంటి కేలరీలు ఉన్నవాటిని వాసన చూసి తిన్నామనే సంతృప్తి కలుగుతుందని…తర్వాత తినే ఆహారం తక్కువగా తింటారని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

ఆహార పదార్థాల సువాసన వల్ల పూర్తి సంతృప్తి అనిపించి కడుపు నిండినట్టు అనిపించడమే దీనికి కారణం అని వెల్లడించారు. యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *