థ్రిల్లర్ కథతో తెరకెక్కిన 118

థ్రిల్లర్ కథతో తెరకెక్కిన 118

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పనిచేసే గౌతమ్ కి, ఓ వేడుకలో భాగంగా ఒక రిసార్ట్ లోని 118 అనే రూమ్‌లో స్టే చేస్తాడు. ఆ రోజు రాత్రి సరిగ్గా 1:18 నిమిషాలకు అతనికి ఓ కల వస్తుంది. గౌతమ్ కి వచ్చిన కలలో ఆద్య అనే అమ్మాయిని ఎవరో కొట్టడం, ఓ కారును పెద్ద కొండ మీదనుంచి చెరువులో పడేయటం లాంటి సంఘటనలు కనిపించటంతో గౌతమ్‌ ఆ కల తనకి ఎందుకు వస్తుంది? అసలు ఆద్య ఉందా? ఉంటే ఆమెని ఎవరు చంపాలనుకున్నారు అనే విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో కలలో కనిపించిన ప్రాంతాలు గౌతమ్ కి నిజజీవితంలో కనిపిస్తాయి. దాంతో ఆద్య ఎక్సిస్టెన్సీ గురించి బలంగా నమ్మి, ఆమెకోసం వెతుకులాట మొదలుపెడుతాడు. ఏ విషయాన్ని అయినా మొదలుపెడితే మధ్యలో వదిలేసే అలవాటులేని గౌతమ్‌ ఆద్యని వెతికే క్రమంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? ఆద్య ఎవరు? ఆమె గురించే అతడికి ఎందుకు కలలు వస్తుంటాయి? ఆద్యకి గౌతమ్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

గతంలో ఒకసారి జర్నలిస్ట్ పాత్రలో కనిపించిన కల్యాణ్‌ రామ్‌ మరోసారి 118లో స్టైలిష్ జర్నలిస్ట్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. లుక్ నుంచి యాక్టింగ్ వరకూ అన్నింటా కళ్యాణ్ రామ్ ది బెస్ట్ ఇచ్చాడు. కమర్షియల్ హంగులకి పోకుండా ఎక్కడ ఓవర్ యాక్షన్ చేయకుండా కళ్యాణ్ రామ్ తన పాత్ర పరిధి మేరకు నటించాడు. సింపుల్ గా చెప్పాలి అంటే ఎన్టీఆర్ కి టెంపర్ సినిమా ఎంత పేరు తెచ్చిందో, కళ్యాణ్ రామ్ కి ఈ 118 సినిమా అంత పేరు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక చాలా రోజుల తర్వాత కనిపించిన నివేథా థామస్ ఆద్య పాత్రలో అద్భుతంగా నటించింది. నివేద కాకుండా ఇంకెవ్వరూ ఆ పాత్రలో కనిపించినా అంత బాగా నటించే వారు కాదేమో. మరో హీరోయిన్ షాలిని పాండే పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేకున్నా ఉన్నంతలో మంచి నటనే కనబరిచింది. మిగిలిన పాత్రల్లో కనిపించిన వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మొదటిసారి తెలుగు సినిమాకి దర్శకత్వం వహించిన గుహన్, మూవీ మొదలైన కాసేపటికే ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన విధానం బాగుంది. రేసీ స్క్రీన్ ప్లే తో సాగిన ఫస్ట్ హాఫ్, ప్రేక్షకులని చాలా థ్రిల్ కి గురి చేస్తుంది కానీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ‘ల్యూసిడ్ డ్రీమింగ్’ అనే మెయిన్ పాయింట్స్ పై గుహన్ పెద్దగా శ్రద్ధ పెట్టినట్లు కనిపించలేదు. ప్రీ-క్లైమాక్స్ నుంచి సినిమా చాలా చప్పగా సాగుతుంది, ఎక్కడా థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉండదు, అద్భుతంగా కథని మొదలు పెట్టిన గుహన్, దాన్ని అదే స్థాయిలో నడిపించడంలో కాస్త తడబడినట్లు తెలుస్తోంది. ఇక టెక్నీకల్ విషయాలకి వస్తే గుహన్ సినిమాటోగ్రఫీ 118 మూవీకే హైలెట్ గా నిలిచింది, థ్రిల్లర్ కి కావాల్సిన పెర్ఫెక్ట్ విజువల్స్ ని చూపించాడు. బ్యాక్ గ్రౌండ్, ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. మొత్తానికి 118 సినిమాని లాజిక్స్ లేకుండా చూస్తే ఎంజాయ్ చెయ్యొచ్చు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *