అమెరికాలో కాల్పుల మోత... 11 మంది మృతి

అమెరికాలో కాల్పుల మోత... 11 మంది మృతి

అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వర్జీనియా రాష్ట్రంలోని బీచ్ నగరంలో జరిగిందీ ఘటన. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రభుత్వం భవన సముదాయంలోకి ప్రవేశించిన దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఆరుగురిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నాడు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగుడిని హతమార్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *