ఈ హీరోయిన్లు వెరీ స్పెషల్ ఎందుకంటే..!!

ఈ హీరోయిన్లు వెరీ స్పెషల్ ఎందుకంటే..!!

ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు. ఎన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్నామన్నదే ముఖ్యం. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయా? లేదా? అన్న సంగతి పక్కన పెడితే, ఎన్నేళ్లుగా టాలెంట్‌తో నిలదొక్కుకోగలుగుతున్నారు అనేదే గమనించాలి.అయితే హీరోయిన్స్ కు ఒక సినిమా హిట్టయినా వరుసగా అవకాశాలు రాకపోవచ్చు. అలాగే వరుసగా ఫ్లాప్‌లు వస్తున్నా, అవకాశాలు వరుస రావచ్చో. మరి హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్స్ పై స్పెషల్ ఫోకస్…

హీరోలకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ లెక్కలు ఉంటాయేమో గానీ హీరోయిన్లకు మాత్రం 10 ఇయర్స్ఇండస్ట్రీనే ఓ పెద్ద చాలెంజ్ రోజుకో కొత్త హీరోయిన్ కొత్త అందాలు పరిచయమయ్యే సినిమా ఫీల్డ్ లో హీరోయిన్లు పదేళ్ల కెరీరను నిలబెట్టుకోవడం మాటలు కాదు.
ఇప్పుడున్న కంపీటిషన్‌లో గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్‌గా టెన్ ఇయర్స్ సక్సెస్ కంప్లీట్ చేయడం చాలా కష్టం. కానీ కాజల్ అగర్వాల్ ఈ రేర్ ఫీట్ ను సాధించింది.2007లో వచ్చిన లక్ష్మీ కల్యాణం మూవీతో కాజల్‌ తెలుగు సినీ ప్రయాణం మొదలైంది. అక్కడి నుంచి ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అలా ఇప్పటికీ కాజల్‌ అభిమానుల్లో తనపై ఉన్న అంచనాలను ఏమాత్రం తగ్గనివ్వకుండా ఇండస్ట్రీలో చందమామలా వెలుగుతూనే ఉంది.మగధీర మూవీతో కాజల్ స్టార్ స్టెటస్ అందుకుంది అక్కడ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ హీరోలందరితో సినిమాలు చేసింది.

సౌత్‌లో స్టార్ స్టెటస్ రాగానే బాలీవుడ్‌పై ఫోకస్ చేసింది. కానీ ఇక్కడ వచ్చినంత క్రేజ్ మాత్రం హిందీలో రాలేదు. అయితే సౌత్‌లో కొత్త హీరోయిన్స్ రావడంతో అమ్మడికి అవకాశాలు కాస్త తగ్గిపోయ్యాయి. దీంతో కాజల్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడుతుందని అనుకుంటున్న టైంలో నేనే రాజు.. నేనే మంత్రి, అ!, చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైది నెంబర్ 150 సినిమాలు సక్సెస్ కావడంతో మళ్లీ వరస అవకాశాలతో బిజీ అయిపోంది.

ఇటీవలే వచ్చిన సీత మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకున్న అమ్మడి జోరు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ్‌లో పారిస్ పారిస్ , కోమలి,భారతీయుడు 2 , తెలుగులో శర్వానంద్‌తో కలిసి రణరంగం సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు తేజ డైరెక్షన్‌లో మరో సినిమా చేయబోతుంది. ఇలా తన కెరీర్ లో గ్లామర్ పాత్రలు, పెర్ఫార్మెన్స్ పాత్రలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్లు దాటుతున్న కాజల్ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే వెలుగొందుతోంది. మరి ఈ బ్యూటీ జర్నీ మరింతె కాలం ఉంటుందో వేచిచూడాలి.
15 ఏళ్లకే నటిగా కెరీర్ మొదలు పెట్టింది మిల్కీ బ్యూటీ తమన్నా. నటిగా హిందీలో పరిచయం అయిన ఈ బ్యూటీ టాలీవుడ్‌కు శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తరువాత తమిళ్‌లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ తెలుగులో శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్‌ మూవీ తమన్నాకు బ్రేక్‌నిచ్చింది. ఈ సినిమా తర్వాత అమ్మడికి అన్నీ హ్యాపీడేసే.. హీరోయిన్‌గా ఫస్ల్ సక్సెస్ అందుకున్న తమన్నా తక్కువ టైంలోనే తెలుగు , తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ అందుకుంది. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా దశాబ్దకాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతుంది.

బాలీవుడ్‌, టాలీవుడ్, కోలీవుడ్‌ ఇండస్ట్రీలని చుట్టేస్తున్న తమన్నా నటిగా దశాబ్దంన్నరకు రీచ్‌ అయింది. అయినా ఇప్పుటికీ హీరోయిన్‌గా బిజీగానే కెరీర్ కొనసాగుతోంది.ఇలా కొత్త హీరోయిన్స్‌కు గట్టి పోటి ఇస్తునే కెరీర్‌కు సక్సెస్ పుల్‌గా లాగుతుంది. అయితే ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ సినిమాల్లో నటించేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ప్రస్తుతం సైరా సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. ఇక బాలీవుడ్ హిట్ మూవీ క్వీన్ రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మి సినిమాతో పాటు హిందీలో ఓ హారర్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమాలతో పాటు కోలీవుడ్‌లో మరో రెండు సినిమాలు కమిట్ అయిందని సమాచారం.

రెండు మూడేళ్ల కెరీర్లో ఐదారు సినిమాలు చేసి ఇంటి ముఖం పడుతున్నారు చాలా మంది హీరోయిన్లు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే తాపత్రయంతో ఒకటి రెండు హిట్లు రాగానే రేట్లు పెంచి, అన్ని సినిమాలు ఒప్పుకుని చివరకు డేట్లు ఎడ్జెస్ట్ చేయలేక నిర్మాతలను ఇబ్బందుల పాలు చేసి చివరకు ఒకటి రెండు ప్లాపులు రాగానే కనుమరుగై పోతుంటారు. కానీ కొద్ది మంది హీరోయిన్లు మాత్రం ఒక లాంగ్ విజన్ తో లాంగ్ ఇన్నింగ్స్ ఆడే లక్ష్యంతో కెరీర్ ను జాగ్రత్తగా డిజైన్ చేసుకుంటారు.
బెంగుళూరు బ్యూటీ, యోగా టీచర్ అనుష్క పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రావడం రావడమే గ్లామరస్‌ రోల్‌తోనే ఎంట్రీ ఇచ్చిన స్వీటీ ఆ తర్వాత దాన్నే కంటిన్యూ చేస్తూ గ్లామరస్‌ రోల్స్‌లోనే కనిపింది. టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లోనూ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది.అయితే అనుష్క గ్లామరస్‌ హీరోయిన్‌ అని ముద్ర పడుతున్న టైమ్‌లో వచ్చిన అరుంధతి మూవీ ఈ బ్యూటీ క్రేజ్‌ని అమాంత పెంచేసింది.గ్లామర్‌ స్టార్‌ అన్నవాళ్లే పర్ఫార్మెన్స్‌ స్టార్‌ అని అనేశారు. అరుంధతి తరహాలోనే రుద్రమదేవి, భాగమతి చిత్రాల్లో అనుష్క అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక బాహుబలి సినిమాలో ఈ యోగా బ్యూటీ పోషించిన దేవసేన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

వేదంలో వేశ్యగా, సైజ్‌ జీరోలో బొద్దు అమ్మాయిగానూ అలరించిన అనుష్క, విక్రమార్కుడు,లక్ష్యం , రగడ, మిర్చి వంటి కమర్షియల్‌ చిత్రాల్లోనూ నటించి స్టార్ హీరోయిన్ గా తన స్థానాన్ని పదిలపరచుకున్నది.తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకు వెళ్లి నెంబర్ వన్ పొజీషన్ చేరుకుంది.చారిత్రక, జానపద చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూనే మరోవైపు అందాలతో అదరహో అనిపిస్తోంది… విలక్షణమైన పాత్రలు పలకరిస్తే చాలు వెంటనే అంగీకరించేసి ఆకట్టుకొనే ప్రయత్నమూ చేస్తూ ఉంటుంది… అనుష్కలోని ఆ విశిష్ట లక్షణమే ఆమె కెరీర్ సజావుగా సాగేలా చేస్తోందని చెప్పొచ్చు.

సూపర్ నుంచి సింగం దాకా.. అరుంధతి నుంచి రుద్రమ దేవి దాకా.. ఏ క్యారెక్టరయినా.. పర్ఫెక్ట్ గా నటించే హీరోయిన్ అనుష్క. నటించడం కాదు.. జీవిస్తుంది. ఆ పాత్రకే నిండుదనం తెస్తుంది అనే రేంజ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సైరా సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోన్న స్వీటీ లేడి ఓరియేంటెడ్ మూవీ సైలెన్స్ అనే బైలింగ్వల్ మూవీలో నటిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన 14 ఏళ్లు అవుతున్న ఇంకా స్టార్ హీరోయిన్‌గానే కెరీర్‌ని కొనసాగిస్తుంది యోగా బ్యూటీ అనుష్క.
కోలీవుడ్

నయనతారకి ఉండే క్రజ్ వేరు.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి టెన్ ఇయర్స్ దాటుతున్నా, యంగ్ హీరోయిన్స్ ఎంత మంది వచ్చినా కూడా తన రేంజ్ తగ్గట్లేదు, వచ్చే అవకాశాలు తగ్గట్లేదు.. తనకంటూ స్పెషల్ మార్కెట్ ని ఏర్పరుచుకున్న నయనతార కోలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. మూడు పదులు దాటిన ఈ బ్యూటీకి కొత్త హీరోయిన్స్ కు ఉన్నంత డిమాండ్ ఉన్నది. ఇప్పటికి సౌత్‌లో అన్ని భాషల్లో సినిమాలు చేస్తు కాల్షీట్స్ అడ్జెస్ట్ చేయాలేనంత బిజీగా మారిపోయింది.ఒకపక్క స్టార్ హీరోలతో నటిస్తునే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తు హిట్స్ కోడుతుంది.

విభిన్న పాత్రలు చేస్తూ సుదీర్ఘకాలం పాటు కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్న నయనతార లేడి ఓరియేంటెడ్ సినిమాలతోనే ఎక్కువగా హిట్స్ అందుకుంది. నయన్ ఓ సినిమా కమిట్ అయిందంటే ఆ సినిమా పక్కా హిట్ అనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. అందుకే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా, నటనకి ప్రాధ్యాన్యం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది.

మంచి స్టోరీస్‌ని సెలక్ట్ చేసుకుంటు లాంగ్ విజన్ తో అద్భుత విజయాలతో లాంగెస్ట్ అండ్ సక్సెస్ ఫుల్ కెరీర్‌ని కొనసాగిస్తున్న టాప్ ర్యాంకింగ్ హీరోయిన్‌గా , సోలో హీరోయిన్ గా నయనతార బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తోంది. ఇక సీనియర్ హీరోలకు బెస్ట్ అప్షన్‌గా మారిన నయనతార, కోలీవుడ్, టాలీవుడ్‌లో వరసగా క్రేజీ ప్రాజెక్ట్ప్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తునే , తమిళ్‌లో విజయ్, సూర్య సినిమాలతో పాటు రెండు హీరోయిన్ ఓరియేంటెడ్ సినిమాల్లోను నటిస్తోంది.

చెన్నై బ్యూటీ త్రిష తమిళ్‌లో సిమ్రాన్ హీరోయిన్‌గా నటించిన ఓ సినిమాలో ఓ పాత్రలో నటించింది. నీ మనసు నాకు తెలుసుతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అయింది. అయితే హీరోయిన్‌గా ఈ బ్యూటీకి వర్షం సినిమా బ్రేక్‌ ఇవ్వడంతో స్టార్ హీరోలందరితో నటించింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకొని ఎవర్ గ్రీన్‌ నటిగా పేరుతెచ్చుకుంది. అయితే అనుష్క , కాజల్ రాకతో ఈ బ్యూటీ కెరీర్‌కు గండి పడిన్నట్టు అయింది. దీంతో టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయ్యాయి.దీంతో మదర్ ల్యాండ్ తమిళ్‌లో వరస అవకాశాలు అందుకొని అక్కడ కూడా స్టార్ స్టేటస్ అందుకుంది.

త్రిష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు దాటిపోతుంది. అయితే టాలీవుడ్ లో సినిమాలు చేయకపోయినా.. కోలీవుడ్ లో మాత్రం సినిమాలు చేస్తూ బిజీ ఉంది. ఇటీవల కాలంలో త్రిష తెలుగులో ఒక్క చిత్రం కూడా చేయడం లేదు.ఇక తమిళ్‌లో కూడా హీరోయిన్‌గా కెరీర్ ఎండ్ అవుతుందని అనుకుంటున్న టైంలో 96, పేట సినిమాలు సక్సెస్ కావడంతో త్రిషకు ఇప్పుడు వ‌రసబెట్టి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అర‌డ‌జ‌నుకు పైగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. తమిళంలో విజయం సాధించడంతో అక్కడ తన హవా కొనసాగిస్తోంది.2001లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ఇష్టంగా అడుగుపెట్టింది శ్రియ శరన్. ఫస్ట్ సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకుల మదిని దోచుకుంది. కెరీర్‌ తొలినాళ్లలో శ్రియ ఎక్కువగా ప్రేమకథల్నే సెలక్ట్ చేసుకోవడం అమ్మడి కెరీర్‌కు ప్లస్‌ పాయింట్‌లా మారింది. శ్రియ కూడా తెలుగులో దాదాపు టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది. అయితే కొత్త అందాల రాకతో ఈ బ్యూటి అటోమిటిక్‌గా అవకాశాలు తగ్గిపోయ్యాయి. అయినా కూడా వాళ్లతో సమానంగా గ్లామర్ విషయంలో పోటి పడుతూ అవకాశాలు అందుకుంటుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు దాటినా ఇంకా ఈ హీరోయిన్‌గా శ్రీయ సర్వైవ్ అవుతూనే ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ కే ఎస్ రవికుమార్ కాంబోలో తెరెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా సెలక్ట్ అయింది.
దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది ఆపిల్ బ్యూటీ హన్సిక. ఈ సినిమా హిట్‌తో స్టార్ హీరోలందరితో నటించే ఛాన్స్ అందుకుంది. అయితే తెలుగు ఆడియన్స్‌ ఈబ్యూటీని అంతగా పట్టించుకోకపోయిన తమిళ తంబిలకు మాత్రం తెగ నచ్చేసింది. దీంతో అక్కడ స్టార్ హీరోలందరితో నటించిన సినిమాలన్ని సూపర్ హిట్ కావడంతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే గ్లామర్ బ్యూటీగా కుర్రకారులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ దేశముదురు భామ.. ఇప్పుడు యాక్టింగ్‌కు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్రలు, ఛాలెంజింగ్ పాత్రలు ఉన్న సినిమాలతో పాటు లేడి ఓరియేంటెడ్ సినిమాలు చేసి హిట్స్ అందుకుంటుంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ చిన్నది చేతిలో రెండు సినిమాలున్నాయి.కపూర్‌ ఖాందాన్‌కు చెందిన అమ్మాయి కావడంతో కరీనా సినిమాల్లోకి రావడానికి అంత కష్టపడలేదు. 2000లో వచ్చిన రెఫ్యూజీతో కరీనా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ ఈ బ్యూటీ ప్రేక్షకులను అలరిస్తున్నారంటే అందుకు కరీనా ఎంచుకునే సినిమాలనే చెప్పాలి. కరీనా కంటే ముందు అక్క కరిష్మా సినిమాల్లో రాణించింది. కానీ నటన విషయంలో మాత్రం అక్కను మించిన చెల్లి అని నిరూపించుకుంది కరీనా . పదేళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో రాణించిన కరీనా.. పెళ్లై ఓ కుమారుడు ఉన్నప్పటికీ అవకాశాలు తగ్గడంలేదు.  ప్రస్తుతం కరీనా గుడ్‌న్యూస్‌ ,అంగ్రేజీ మీడియం సినిమాల్లో నటిస్తుంది.ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భాష బాగా వచ్చిన వారికే అవకాశాలు రావడం కష్టం. అలాంటిది ఎక్కడో లండన్‌లో పుట్టి మన ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చింది కత్రినా కైఫ్‌. 2003లో బాలీవుడ్‌కు పరిచయమైన కత్రినా ఇప్పటికీ తన అందం, గ్లామర్‌, ఫిట్‌నెస్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూనే ఉంది. అయితే ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో కత్రినా అందుకున్న అవార్డులు తక్కువే. కానీ అవకాశాలకు మాత్రం ఎలాంటి కొదవలేదు. హిట్‌, ఫ్లాప్‌ అన్న విషయంతో సంబంధం లేకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూనే ఉంది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *